Skip to playerSkip to main content
  • 8 years ago
Producer Raj Kandukuri's latest movie is Mental Madhilo. This movie gets good talk before its release.

పెళ్లిచూపులు లాంటి ఘన విజయాన్ని అందించిన నిర్మాత రాజ్ కందుకూరి రూపొందించిన మరో చిత్రం మెంటల్ మదిలో. హీరో శ్రీ విష్ణు నటించిన ఈ చిత్రం ద్వారా వివేక్ ఆత్రేయగా దర్శకుడిగా, నివేదా పేతురాజ్, అమృత శ్రీనివాసన్ లాంటి కొత్త తారలు పరిచయం అయ్యారు. చిన్న చిత్రంగా వచ్చిన మెంటల్ మదిలో విడుదలకు ముందే మంచి టాక్‌ను సంపాదించుకొన్నది. సినీ విమర్శకుల మెప్పు పొందుతున్నది. ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు భారీగా ఉండటం సినిమాకు ఉన్న ఆదరణను చెబుతున్నది.
నవంబర్ 24న రిలీజైన మెంటల్ మదిలో లోకల్, ఓవర్సీస్ మార్కెట్‌లో మంచి కలెక్షన్లు సాధిస్తున్నది. తొలి వారంలోనే 2.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
మెంటల్ మదిలో చిత్రం అమెరికాలో దాదాపు 70 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రతీ స్క్రీన్‌లో కూడా మంచి కలెక్షన్లను సాధించాయి. మెంటల్ మదిలో చిత్రంతోపాటుగా రిలీజైన బాలకృష్ణుడు, నెపోలియన్, ఇతర చిత్రాల కంటే మంచి వసూళ్లను సాధించడం గమనార్హం.
అమెరికా బాక్సాఫీస్‌ వద్ద మెంటల్ మదిలో చిత్రం 26వ స్థానంలో నిలిచింది.
ఈ చిత్రం ఇప్పటికీ సుమారు 90 లక్షల రూపాయలకు మించి కలెక్ట్ చేసింది. అని పేర్కొన్నారు.
Be the first to comment
Add your comment

Recommended