Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
A youth beats bithiri sathi at V6 Office in Hyderabad.know here why ?

వీ6 ఛానల్‌లో ప్రసారమయ్యే తీన్మార్ వార్తలంటే అందరికీ బిత్తిరి సత్తే గుర్తుకు వస్తాడు. కాగా, తాజాగా, ఆయనపై వీ6 ఆఫీసు ముందే దాడి జరిగింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ.. సత్తిపై దాడి చేసిన వ్యక్తిని చితకబాదారు.
మణికంఠ అనే వ్యక్తి చేతిలో దాడికి గురైన బిత్తిరి సత్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వీ6 యాజమాన్యం స్పందించింది. దాడికి పాల్పడిన వ్యక్తి గురించి ఇప్పటికే ఆరా తీసినట్లు తెలిసింది.
ఓ మెంటల్ కేరక్టర్ సత్తితో తెలంగాణ భాషను అపహాస్యం చేస్తూ.. వీ6 ఛానెల్ భాషను అవమాన పరుస్తున్నదనే తాను సత్తిపై దాడి చేశానని సత్తిపై దాడికి పాల్పడిన మణికంఠ అనే వ్యక్తి చెప్పాడు. ఎంతో కాలంగా సత్తిపై దాడి చేయడానికి వెయిట్ చేస్తున్నట్లు తెలిపాడు. అంతేగాక, తనకు సినిమాలపై ఆసక్తి ఉందని, తాను కాబోయే దర్శకుడినని చెబుతుండటం గమనార్హం.

Category

🗞
News

Recommended