Skip to playerSkip to main content
  • 8 years ago
Naga Shaurya and Rashmika Mandanna's latest movie is Chalo. This film is directed by Venky Kudumula. Music scored by Mahati Swara Sagar, Produced by Usha Mulpuri under Ira Creations. This movies teaser released by Director Trivikram Srinivas recently. In that occassion, He spoke to media regarding the event.

నాగశౌర్య, రష్మిక మందన్న నటించిన చల్ చిత్రం టీజర్ ఇటీవల రిలీజైంది. ఇరా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిత్ర యూనిట్‌కు, తొలిసారి దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్న వెంకీ కుడుములకు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ..
నేను సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను మాట్లాడాల్సిందంతా సినిమాల్లోనే మాట్లాడేస్తుంటాను. అందుకే ఎక్కువగా సినిమా వేదికలపై విసిగించను.
చలో దర్శకుడు వెంకట్‌కు సినిమా అంటే ఇష్టం. చాలా ప్రయాణం చేసిన తర్వాత నా వద్దకు వచ్చాడు. ఆయన ప్రయాణంలో నేను ఓ మజిలీ. నా వద్ద చేరిన తర్వాత వెంటనే సొంతంగా సినిమా చేయడం నాకు చాలా సంతోషం కలిగించింది.
నా మాదిరిగానే నిర్మాత కొర్రపాటి సాయికి సినిమాలు అంటే చాలా ఇష్టం. అందుకే సినిమాలు తీస్తూనే ఉంటాడు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా తెలియదు. రాజమౌళి నుంచి అవసరాల శ్రీనివాస్‌తో సినిమాలు తీశాడు.
Be the first to comment
Add your comment

Recommended