Padmavathi : Karni Sena Members Vandalise Cinema Hall In Kota Over Trailer Screening

  • 7 years ago
The Karni Sena members can be seen in the video smashing glass counters and windows of Aakash theatre where Padmavati trailer was being played.

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పద్మావతి చిత్రంపై వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. ఆ చిత్రంలో పద్మావతి పాత్రను వక్రీకరించారని ఆ చిత్ర విడుదలను నిలిపివేయాలని పలువురు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా 'పద్మావతి' చిత్ర విడుదలను ఆపలేరని ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే చెప్పింది. ఆ చిత్రంలో నటించినందుకు ఒక మహిళగా తాను చాలా గర్వపడుతున్నానని తెలిపింది.అయితే ఆ ప్రకటన వెలువడిన రోజే పద్మావతి చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించిన థియేటర్ పై దాడి జరిగింది.
మాకు చూపించకుండా ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తే థియేటర్లపై దాడి చేస్తాం...అంటూ కొన్నాళ్లుగా వస్తున్న బెదిరింపులను నిజం చేస్తూ రాజస్థాన్ లోని కోటాలో ఉన్న ఆకాశ్ థియేటర్ ను కర్ణిసేన ఆధ్వర్యంలో రాజ్ పుత్‌ వర్గీయులు ధ్వంసం చేశారు. కర్ణిసేన కార్యకర్తలు రాజ్ పుత్ వర్గీయులు ఆకాశ్ థియేటర్ పై దాడి చేసి కౌంటర్ అద్దాలను కిటికీలను ధ్వంసం చేశారు.
దాడులకు పాల్పడిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామికంగా ఆ చిత్రానికి వ్యతిరేకంగా నిరసన తెలపవచ్చని అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా హెచ్చరించారు.

Recommended