Baahubali actress Anushka Shetty is the super fan of one of the most elegant and classiest personalities to have ever graced the beautiful game of cricket, Rahul Dravid. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.... వయసు 36. అమ్మడుకి ఇంత వయసొచ్చినా పెళ్లికి మాత్రం నో అంటోంది. ఇంకా సినిమాల మీద సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. అనుష్క త్వరలో 'భాగమతి' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నే సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ అనుష్క తన సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు చెప్పింది. టీనేజ్‌లో ఉన్నపుడు సినిమా స్టార్లు, క్రికెటర్ల మీద ఎఫెక్షన్ పెంచుకోవడం సహజం, తను కూడా స్టార్ క్రికెటర్‌ను ప్రేమించానని తెలిపింది. ‘రాహుల్ ద్రవిడ్ నా అభిమాన క్రికెటర్. నా చిన్నతనం నుంచి అతనంటే నాకు పిచ్చి. ఎంతలా అంటే ఒకానొక సమయంలో ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయా' అని అనుష్క వెల్లడించారు. ప్రస్తుతం తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, పెళ్లి గురించి ఆలోచించే సమయం కూడా లేదని అనుష్క పలు సందర్భాల్లో వెల్లడించారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరీర్ మీదనే ఉందని అనుష్క తెలిపారు. ప్రస్తుతం అనుష్క ‘భాగమతి' అనే చిత్రంలో నటిస్తున్నారు.
Be the first to comment