Virat Kohli Need One 4 And 11 Runs To Break 2 International Records | Oneindia Telugu

  • 7 years ago
Team india Captain Virat kohli need one four to complete 200 fours in international t20i cricket.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రెండు రికార్డుల్ని సాధించేందుకు చేరువలో ఉన్నాడు. రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో శనివారం జరగనున్న రెండో టీ20లో కోహ్లీ ఈ రికార్డులను సాధించే అవకాశం ఉంది. అంతర్జాతీయ టీ20లో 200 ఫోర్లను సాధించడానికి కోహ్లీ ఒక్క ఫోర్ దూరంలో ఉన్నాడు.
రెండో టీ20లో విరాట్ కోహ్లీ ఫోర్ కొడితే 200 ఫోర్లు సాధించిన సాధించిన మూడో క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. ఇప్పటివరకు టీ20ల్లో కేవలం ఇద్దరు మాత్రమే 200 ఫోర్లు రికార్డుని అందుకున్నారు. అందులో ఒకరు శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షాన్(223) కాగా, మరొకరు అఫ్ఘనిస్థాన్‌కు చెందిన మొహ్మద్ షహజాద్(200).
నిజానికి ఢిల్లీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 200 ఫోర్లు మార్కును విరాట్ కోహ్లీ చేరతాడని భావించినా అది జరగలేదు. తొలి టీ20లో 11 బంతులను ఎదుర్కొని కేవలం మూడు సిక్సుల సాయంతో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క ఫోర్ కూడా కొట్టక పోవడం విశేషం.

Recommended