కాంగ్రెస్ కాకుంటే మరోటి : రేవంత్‌కు ఝలక్‌లు
  • 6 years ago
Assembly officials removed Revanth Reddy name plate from Telugu Desam LP on Monday morning. meanwhile TTDP presdent L Ramana lashed out at Revanth Reddy for joining in congress issue
టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డిపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తాను పార్టీ మారాలని ఆరు నెలల ముందు నుంచే రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందించుకున్నారని అన్నారు. ఆ కథ ఇప్పుడు క్లైమాక్స్‌కు తీసుకు వచ్చారని రమణ ఆరోపించారు.
ఆరు నెలలుగా రేవంత్ కాంగ్రెస్‌కు టచ్ లో ఉన్నారని, రేవంత్‌ను ఆహ్వానించే విషయంలో మిగతా నాయకుల అభిప్రాయాలను స్వీకరించే నెపంతో కాంగ్రెస్ పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందని వ్యాఖ్యానించారు.ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసివచ్చిన తరువాత.. ఆయన తనను వ్యతిరేకిస్తున్న డీకే అరుణ, కోమటిరెడ్డి వంటి వారి దగ్గరికెళ్లి ప్రాధేయపడ్డారని ఎల్ రమణ విమర్శించారు. తెలుగుదేశం పార్టీని వీడాలని ఆయన ఎంతో ముందుగానే అనుకున్నారని, కాంగ్రెస్ కాకుంటే మరో పార్టీలోకి మారుండేవారని అన్నారు.
Recommended