Achari america Yatra movie Review

  • 6 years ago
Achari America Yatra' movie Review. Achari America Yatra movie written and directed by G Nageswara Reddy and jointly produced by Kirthi Chowdary and Kittu.The starring includes Manchu Vishnu,Brahmanandam, pragya jaiswal etc.
కృష్ణమాచారి(మంచు విష్ణు) పురోహిత్యంలో ఘనాపాటి అప్పలాచారి (బ్రహ్మానందం) వద్ద శిష్యరికం చేస్తుంటాడు. ఓసారి అప్పలాచారి శిష్యబృందంతో కలిసి వేలకోట్ల అధిపతి చక్రపాణి(కోట శ్రీనివాసరావు) ఇంట్లో హోమం నిర్వహించేందుకు వెళతాడు. ఈ క్రమంలోనే కృష్ణమాచారి ఆ ఇంటి వారసురాలైన రేణుక(ప్రగ్యా జైస్వాల్)తో ప్రేమలో పడతాడు. హోమం చేస్తుండగా చక్రపాణి అనుకోకుండా గుండె పోటుతో చనిపోతాడు. అతడి చావుకు కారణం అప్పలాచారి అండ్ కో కారణం అంటూ చక్రపాణి మనుషులు వీరిని చంపేందుకు వెంటపడుతుంటారు. వీరి బారి నుండి తప్పించుకోవడంతో పాటు నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని చెప్పి గురువుగారిని అమెరికా వెళ్లేందుకు ఒప్పిస్తాడు కృష్ణమాచారి. కాని కృష్ణమాచారి అమెరికా యాత్ర వెనక మరో కారణం ఉంటుంది. చక్రపాణి చావుకు కారకులు ఎవరు? చివరకు కథ ఎలా సుఖాంతం అయింది అనేది తెరపై చూడాల్సిందే.
పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కృష్ణమాచారిగా మంచు విష్ణు పర్ఫెక్టుగా నటించారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌‌ నటన పరంగా తనను తాను నిరూపించుకునే సీన్లు పడక పోయినా.... అందంతో మెప్పించింది.
బ్రహ్మానందం పురోహితుడి పాత్ర వేస్తే తెరపై ఏ స్థాయిలో రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎస్‌.ఎస్‌.థమన్‌ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ యావరేజ్‌గా ఉంది.
సినిమా కథలో ఏ మాత్రం కొత్తదనం లేదు. రోటీన్ స్టోరికీ కామెడీ, యాక్షన్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేద్దామని ట్రై చేశారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. స్క్రీన్‌ప్లే ప్రేక్షకులకు మరింత బోర్ కొట్టించింది.

Recommended