Skip to playerSkip to main content
  • 4 minutes ago
Nallamada Drain Overflowing due to Impact of Cyclone Murasu : మురసు తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లా పెదనందిపాడు సమీపంలో నల్లమడ వాగు ఉప్పొగింది. పలుచోట్ల వాగుకు గండి పడి పొలాలు, రహదారులను వరద ముంచెత్తింది. పెదనందిపాడు - పర్చూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో NDRF బృందాలు రంగంలోకి దిగాయి. అత్యవసర పనుల నిమిత్తం రాకపోకలు సాగించే వారిని NDRF సిబ్బంది వాగు దాటిస్తున్నారు. నల్లమడ వాగు, నక్కవాగుకు గండ్లు పడ్డాయి. దీంతో పెదనందిపాడు, నాగులపాడు గ్రామాలతో పాటు కాకుమాను మండలం కొమ్మూరు, గార్లపాడు గ్రామాలను వరద నీరు చుట్టు ముట్టింది. పెదనందిపాడు నుంచి కొమ్మూరుకు వెళ్లే బాపట్ల ప్రధాన రహదారి పై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. నల్లమడ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కట్టలకు అంచుల వరకు వాగు నీరు చేరడంతో ప్రజలు భయాందోళనలు ఉన్నారు. పెదనందిపాడు నుంచి గుంటూరు, పర్చూరు వైపుగా వెళ్లే ప్రధాన రహదారులకు రాకపోకలు ఆగిపోయాయి. కొమ్మూరు నుంచి గార్లపాడు వెళ్లే రహదారి పై నుంచి భారీ నీరు ప్రవహిస్తోంది. రహదారులు కోతకు గురయ్యాయి. బాపట్ల జిల్లా చెరుకూరు వైపు నల్లమడ వాగు నీరు ప్రవహిస్తోంది.

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
00:38Thank you very much.

Recommended