Skip to playerSkip to main content
  • 4 months ago
BC Protection Act 2026 : స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. కూటమి ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్​ కమిషన్ వివిధ జిల్లాల్లో పర్యటిస్తోందన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు.దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవం, రక్షణ, సామాజిక న్యాయం కోసం "బీసీ రక్షణ చట్టం-2026" చట్టం తీసుకొస్తుందని, ఈ చట్టం 138 బీసీ కులాలకు రక్షణ కల్పిస్తుందన్నారు. ఇప్పటికే బీసీ రక్షణ చట్టం తుది ముసాయిదా సిద్ధమైందన్నారు. కూటమి ప్రభుత్వానికి బీసీలే బ్యాక్ బోన్ అనే విధానంతో వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. సమాజంలో సగానికిపైగా ఉన్న బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేస్తున్నారని తెలిపారు. బీసీ బిడ్డలు ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్న ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందజేస్తున్నామన్నారు. త్వరలో కూటమి ప్రభుత్వం ప్రకటించే మరో డీఎస్సీ ప్రకటన రాగానే ఉచిత కోచింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల కొసం ప్రత్యేకించి 3 బీసీ స్టడీ సర్కిళ్లను విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలలో ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. ఆదరణ 3.0 అమలుకు రూ.1000 కోట్లతో శాశ్వత ఉపాధి కల్పించనున్నామన్నారు. ఇందుకోసం ఏయే ఆధునిక పరికరాలు కావాలో ఆయా కుల సంఘాల కార్పొరేషన్ చైర్మన్లు, ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ బీసీ భవనం నిర్మించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.  

Category

🗞
News
Transcript
00:02BC Lanty backward kathu BC Lanty e rastani backbone kathayar kawawal ane
00:08alo chanlloh varu kuh
00:09Pernadil veeshtu na muna vishyam kudha telae chasthu
00:12Kutubhi ppragutthom
00:13Adikarindu kocchi na tharavarttaan mottomodit budget koda
00:171.99 koat lho keta ayincha aru
00:20Adewithenwa 2 budget lho
00:224.99 koat lho keta ayincha
00:253 budget lho
00:26111 koat lho keta ayincha
00:293 budget lho keta ayincha aru
00:32Vishyam kudha telae chasthu
00:34Hidhi BC Lanty kodamit prabutthom kudna
00:36Chittasudhya ni
00:37Marakasari niruupi chukunna
00:39Vishyam kudha telae chasthu
00:41Vithyepayena
00:42Maree ekkooga
00:44Focus chasthu
00:45Irooza rastani lho unna
00:47NJP guru kula pata salal
00:49Nota Thomin guru kula pata salal
00:51Yadwee vera maandhi vidyatr lho chadu tuna aru
00:54Maree kodtaga
00:55BC Sanggalu aru
00:58Kori kodamit pata salal
01:00Marini kawalani
01:01Maree kori kori kodamit pata salal
01:06Maree kodamit pata salal
01:16Maree a courage kodamit piders
01:17Maree kodamit pabutan
01:20Maree kodamit patti
01:22Maree kodamit p pista lagu kodamit p homage
01:28Thank you so much for joining us today.

Recommended