భారత్- అమెరికా సంయుక్తంగా నిసార్ అనే శక్తివంతమైన శాటిలైట్‌ను నింగిలోకి పంపింది. భూగోళాన్ని పరిశీలించేందుకు తొలిసారిగా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (SDSC SHAR) నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ఇస్రోకి చెందిన GSLV రాకెట్ ద్వారా రాకెట్‌ను ప్రయోగించారు.