Kolikapudi Meet PeddiReddy - వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. రాజమండ్రి విమానాశ్రయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలను కొలికపూడి పూర్తిగా ఖండించారు. తప్పుడు ప్రచారం చేసిన వారికి వివరణ ఇచ్చారు. ఈ నెల 19న తిరుమల శ్రీవారి దర్శనం కోసం తాము హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చామని, ఆ సందర్భంగా అదే ఇండిగో విమానంలో పెద్దిరెడ్డి కుటుంబం కూడా ప్రయాణించిందని వెల్లడించారు. దాంతో మర్యాదపూర్వకంగా, బాగున్నారా సార్ అని పలకరించానని, బాగున్నాను అని చెప్పి ఆయన వెళ్లిపోయారని, జరిగింది ఇదేనని అన్నారు. ఇక, తాను తిరుపతి టూర్ లో ఉన్పప్పుడే సీఎం కార్యాలయం నుంచి పిలుపు వస్తే వెంటనే అమరావతి వెళ్లిపోయానని కొలికపూడి స్పష్టం చేశారు.
A video of TDP MLA Kolikapudi Srinivasa Rao with senior YSRCP leader Peddi Reddy Ramachandra Reddy at Rajahmundry Airport has gone viral on social media, triggering political buzz.
But what's the truth behind it?
Kolikapudi has completely denied the rumors and clarified that it was a chance encounter during a flight from Hyderabad to Tirupati on July 19. He said he greeted Peddi Reddy out of courtesy, and there was no political discussion.