మాజీ ముఖ్యమంత్రి జగన్ పొదిలి పర్యటన వేళ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జగన్ పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు వచ్చారు. ఈ సందర్బంగా జగన్‌కు నిరసన సెగ తగిలింది. సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరుస్తూ డిబేట్ కు నిరసనగా నల్ల బెలూన్లూ, ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. జగన్.. మహిళలకు బహిరంగ క్షమా పణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణుల నుంచి ఎదురు దాడి జరిగింది. ఆ సమయంలో కొందరు రాళ్ళు, చెప్పు లు విసిరారు. దీంతో, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌కు గాయం అయింది. పోలీసు లు వారిని చెదరగొట్టారు. కాగా, ఈ ఘటన పైన మంత్రి లోకేష్ స్పందించారు. దాడులకు పాల్పడి న వారిని వదిలేదని లేదని హెచ్చరించారు.
మీరు జీవం పోశారు.. ఇప్పుడు రోడ్డున పడ్డాం.. మీరే ఆదుకోవాలి: జగన్ ను కలిసిన బాధితులు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-mdu-leaders-met-ys-jagan-439251.html?ref=DMDesc