Bullfight in Market At Sathya Sai District Video Viral : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఆదివారం జరిగిన వారాంతపు సంతలో ఎద్దులు వీరంగం సృష్టించాయి. గాంధీ కూడలిలో రెండు ఎద్దులు కుమ్ములాటతో వ్యాపారులు బెంబేలెత్తిపోయారు. రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న ఆకుకూరలు, కూరగాయలు ఎద్దుల కుమ్ములాటలో ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ కూరగాయల వ్యాపారులు పరుగులు తీశారు. ఎంసేపటికీ అవి ఆగకపోవడంతో వాటిని విడిపించేందుకు స్థానికులు పెద్దపెద్ద కర్రలతో కొట్టినా ఫలితం లేకపోయింది. చివరకు ఎద్దులు సెలూన్ లోపలికి దూరడంతో దాని అద్దాలు సైతం పగిలిపోయాయని యజమాని ఆవేదన చెందారు.