BJP MLAs on PM Modi Amaravati Tour : రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతులు ఏ మాత్రం సంకోచించాల్సిన పని లేదని ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు. ఆంధప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా అమరావతి పనిచేస్తుందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో ముష్కరదాడి తర్వాత విదేశీ పర్యటనను సైతం ప్రధాని మోదీ కుదించుకున్నారని పేర్కొన్నారు. భద్రత వ్యవహారాల సమీక్షలతో తీరికలేని పరిస్థితుల్లో కూడా రాజధాని పునఃప్రారంభానికి ప్రధాని రావడం రాష్ట్రంపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శమని వెల్లడించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
Be the first to comment