Minister Narayana About Swachh Andhra : రాష్ట్రంలో రోజుకు 600 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తవుతోందని మంత్రి నారాయణ అన్నారు. వ్యర్థాల ఏరివేతకు 4 థీమ్‌లతో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడలోని స్వచ్ఛాంధ్ర కెపాసిటీ బిల్డింగ్‌పై పురపాలక, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శాఖల అధికారులతో ఆయన వర్క్‌షాప్ నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు చెత్త ఏరివేతకు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని అధికారులకు సూచించారు. పరిశుభ్రత, రీసైక్లింగ్‌పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
Be the first to comment