Bapatla Post Harvest Center Creates New Innovations: బాపట్ల జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో బాపట్ల కేంద్రంగా పనిచేస్తున్న కోత అనంతర పరిజ్ఞాన కేంద్రం డయాబెటిక్ స్మార్ట్ రైస్ కుక్కర్, గ్లైసెమిక్ ఇండెక్స్ పరీక్ష కిట్, ఎండుమిర్చిని గోతాల్లోకి తొక్కే యంత్రాలను కనిపెట్టింది. పలు సమస్య నుంచి ఉపశమనం, పరీక్షల ఖర్చులను తగ్గించుకోవడం, శారీరక శ్రమకు బదులుగా యంత్రాల వినియోగించడం లాంటి వాటి కోసం ఇవి ఉపయోగపడతాయి. ఈ 3 ఆవిష్కరణలకు పేటెంట్ లభించింది