KTR Speech In Telangana Assembly Sessions : దేశంలో రాష్ట్రాల ఏర్పాటు అనేది 1952 నుంచి కొనసాగుతూ వస్తోందని బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. చివరగా 2001లో నాటి ఎన్డీయే ప్రభుత్వం 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రెండున్నర దశాబ్దాల్లో ఇంకా బాలారిష్టాలు అధిగమించలేదని, ఇటీవలే సెక్రటేరియట్, అసెంబ్లీలు కట్టుకున్నారని తెలిపారు.