CM Chandrababu About Jagan Opposition Status : 'వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అది మనం అడిగితే వచ్చేది కాదు. ఒకరికి అధికారం ఇవ్వాలన్నా, ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా అది ప్రజలే ఇవ్వాలి. శాసనసభలో ఉన్న మొత్తం స్థానాల్లో పది శాతం స్థానాలు గెలుచుకుంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రజలు ఆయన పాలన చూసి 11 సీట్లే ఇచ్చారు. ఆయన అహంకారం చూడండి. ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. డిక్టేట్ చేస్తున్నారు. శాసించాలని అకుంటున్నారు. ప్రతిపక్ష హోదా రాలేదని శాసనసభకు రాను అనేవారు ఎక్కడైనా ఉంటారా? అలాంటి వ్యక్తిన ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా చూస్తామా' అని సీఎం నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.
Be the first to comment