Integrated Residential Schools Foundation In Telangana : రాష్ట్రంలో సరికొత్త గురుకులాలకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం ఇవాళ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 28 నియోజకవర్గాల్లో ఇవాళ పనులు మొదలు పెట్టనున్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలు ఉన్నాయి. అన్నింటినీ కలిపి ఒకే చోట సమీకృత సముదాయంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Be the first to comment