CM Revanth Reddy Launched Sitarama Project : సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పూసుగూడెం పంప్ హౌస్‌ను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడే గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు ఫైలాన్‌ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
Be the first to comment