TDP కి అసలైన పరీక్ష ఇదే YSRCP ఓట్ బ్యాంక్ కొల్లగొట్టడం సాధ్యమే కానీ |Telugu Oneindia

  • last year
TDP Manifesto: TDP Chief ChandraBabu released TDP Manifesto ahead of AP Elections 2024. TDP targets YSRCP votebank for Manifesto Design.

సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల్లో ప్రతీదీ మహిళలకే అందిస్తున్నారు. దీంతో మహిళా ఓట్ బ్యాంక్ లక్ష్యంగా చంద్రబాబు తన మేనిఫెస్టోలో కీలక ప్రకటనలు చేసారు. ప్రతీ మహిళకు నెలకు రూ 1500 వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమం పథకాలు కొనసాగిస్తూ వీటిని అమలు చేస్తారా..లేక వీటిని మాత్రమే అమలు చేస్తారా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇదే సమయంలో ఇప్పటి వరకు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో ఏపీ మరో శ్రీలంక అవుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం టీడీపీ ప్రచారం చేసింది. ఇప్పుడు తిరిగి అదే సంక్షేమం వైపు టర్న్ తీసుకుంది. అయితే, చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు జగన్ ఓట్ బ్యాంకును తన వైపు ఆకర్షించే స్థాయిలో ఉండాలంటే మరి కొన్ని మార్పులు తప్పవనే చర్చ మొదలైంది.


#tdpmanifesto #chandrababunaidu #APCMJagan #ysrcp #andhrapradesh #apelections2024 #mahanadu #janasena #pawankalyan #bjp

~PR.38~