Guntur జిల్లా పొన్నూరు నియోజకవర్గం అనుమర్లపూడి గ్రామంలో టీడీపీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర మట్టి తవ్వకాలను పరిశీలిస్తుండగా.... వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. నరేంద్రను అడ్డుకున్న వైసీపీ శ్రేణులు... ఆయన కారుపై దాడికి దిగారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మీడియాపైనా దాడికి దిగారు. కొందరి కెమెరాలు పగిలిపోయాయి. జగనన్న కాలనీ పేరుతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని నరేంద్ర ఆరోపించారు.
Category
🗞
News