ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ నెల 25వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11వ తేదీన సభలో 2022-23 వార్షిక బడ్జెట్ ను మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టనున్నారు. ఇక, 9,10 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పైన చర్చ ముఖ్యమంత్రి సమాధానం ఉండనున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి బడ్జెట్ పైన చర్చ ప్రారంభం కానుంది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంచి పద్ధతి కాదని అచ్చెన్నాయుడికి సీఎం జగన్ హితవు పలికారు.
Be the first to comment