కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు

  • 2 years ago
శివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు.. రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేకువ జాము నుంచే ఆలయం వద్ద క్యూ కట్టారు.. అక్కడి శివ లింగాలకు అర్చనలు, అభిషేకాలు చేస్తున్నారు.. శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కీసరలో అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కరోనా నిబంధనలు పాటించాలని.. తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.