IND VS ENG: ఈ మాత్రం దానికే దిగులెందుకు బ్రో.. ఇంకా 2 మ్యాచ్‌లున్నాయ్! 1-0 తో ఉన్నాం|Oneindia Telugu

  • 3 years ago
India vs England, 3rd Test: 'No Need to Feel Low, Still Have Two Tests'-Mohammed Shami. India were bundled out for a meagre 78 in the first innings on the first day of the third Test against England.
#INDVSENG3rdTest
#IndiavsEngland
#MohammedShami
#TeamindiaLowscore
#ViratKohli

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో తమ జట్టు పేలవ ప్రదర్శన ఎలాంటి దిగులు లేదని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ అన్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో ఇలాంటివి సహజంగా జరుగుతూనే ఉంటాయని, ప్రతీ టీమ్‌కు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని చెప్పాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయని, ఒక్క ఇన్నింగ్స్ పేలవ ప్రదర్శన తమను మానసికంగా దెబ్బ తీయదని స్పష్టం చేశాడు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 78 పరుగులకు ఆలౌటవ్వడం.. ఆ తర్వాత బౌలింగ్‌లో తేలిపోయి ఆతిథ్య జట్టుకు భారీ స్కోర్ చేసేలా చేయడం ఆటగాళ్ల మానసిక స్థితిని దెబ్బతీస్తుందా? అన్న ప్రశ్నకు షమీ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు.