AP CM ys jagan led andhra pradesh government plans to boycott panchayat elections | Oneindia Telugu

  • 3 years ago
AP CM ys jagan led andhra pradesh government plans to boycott panchayat elections announced recently by state election commission. the govt also plans to challenge sec notification in this regard.

#APPanchayatElectionSchedule
#APLocalBodyElections
#andhrapradeshgovernment
#stateelectioncommission
#jagangovtchallengesAPPanchayatElections
#SECNimmagaddaRameshKumar
#apcmjagan
#secnotification
#aptemplesissue
#CoronaVaccination
#Covid19Vaccine
#StrainVirus

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో తాము వద్దంటున్నా వినకుండా షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కు జగన్‌ సర్కార్‌ భారీ కౌంటర్లు సిద్ధం చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన గంటలోపే దీన్ని తాము అంగీకరించడం లేదని సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ నిమ్మగడ్డకు లేఖ రాశారు. అనంతరం ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు వైసీపీ నేతలు ప్రకటించారు. ఇవాళ ఉద్యోగ సంఘాల సహాయ నిరాకరణపై ప్రకటన రానుంది. అదే సమయంలో ఎన్నికల షెడ్యూల్‌ను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.ఏపీలో ప్రస్తుతం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం జనవరి 23 నుంచి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల కోడ్‌ కూడా అమల్లోకి వచ్చేసింది. దీంతో అధికారుల బదిలీలకు కూడా అవకాశం లేదు. మరోవైపు హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించేశారు. దీంతో ఇక ప్రభుత్వం ఎన్నికల బహిష్కరణ ప్రకటన చేయడం మినహా ఏమీ చేయడానికి లేకుండా పోయింది. గతంలో ఎప్పడూ లేని విధంగా ఎన్నికల కమిషన్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ఎన్నికల బహిష్కరణకు సిద్ధమవుతోంది. అదే జరిగితే రాజ్యాంగ సంస్ధ ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘనపై కోర్టులు ఏం నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.


Recommended