ఈమోస్ వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్

  • 4 years ago
ఆస్ట్రేలియాకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ తన కొత్త ఈమోస్ వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల చేసింది. ఈ కొత్త ఈమోస్ వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ ఆస్ట్రేలియన్ మార్కెట్లో విక్రయించడానికి అనుమతి పొందింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ధర 2,999 ఆస్ట్రేలియన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1.61 లక్షలు.

కొత్త వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ బ్రాండ్ యొక్క పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైనప్ లో ఉంటుంది. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 50 కి.మీ. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు వేగంగా బైక్ నడపవచ్చు.