అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు మరింతగా పెరుగుతూనే ఉంది. పరీక్షలను పెంచుతున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 64,147 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 9747 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.