బాలీవుడ్ ఇండస్ట్రీకి మరో కోలుకోలేని దెబ్బ పడింది.. ధోని బయోపిక్ సినిమాతో ఇండియా మొత్తంగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సడన్ గా ఉరి వేసుకొని సూసైడ్ చేసుకోవడం సినీ ప్రపంచాన్ని తీవ్ర మనోవేదనకు లోను చేస్తోంది. యువ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న 34ఏళ్ల ఈ యువ హీరో మృతి చెందడం వెనుక అసలు కారణం ఏమిటనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.