Sunrisers Hyderabad (SRH) skipper David Warner shared another TikTok video with wife Candice as the couple shake a leg on Telugu song 'Butta Bomma'. Actor Allu Arjun has also reacted to the dance video. #DavidWarner #TikTokvideos #ButtaBommaSong #IPL2020 #sunrisershyderabad #viratkohli #stevesmith #cricket #teamindia #AlluArjun
ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. తెలుగు సూపర్ హిట్ 'బుట్ట బొమ్మ' సాంగ్‌కు చిందేసిన విషయం తెలిసిందే. తన సతీమణి క్యాండిస్‌తో కలిసి స్టెప్పులేసిన ఈ టిక్‌టాక్ వీడియోను తనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో వార్నర్ కూతురు ఇండి కూడా తన హిడెన్ టాలెంట్‌ను బయటపెట్టింది. తమ తల్లిదండ్రుల వెనుకాల తనకు వచ్చిన స్పెప్పులేసి అభిమానుల మనసులను గెలుచుకుంది. అయితే తెలుగు సాంగ్‌కు ఆస్ట్రేలియా లెజండరీ బ్యాట్స్‌మన్ చిందేయడం తెలుగు అభిమానులకు సంతోషాన్నిస్తోంది. అభిమానులే కాదు.. ఈ సాంగ్ హీరో అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ కూడా వార్నర్ స్టెప్పులకు ఫిదా అయ్యారు. ట్విటర్ వేదికగా వార్నర్ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. బన్నీ ట్వీట్‌కు వార్నర్ కూడా సూపర్ సాంగ్ అంటూ బదులిచ్చాడు.
Be the first to comment