U19 World Cup Final 2020 : Yashasvi Jaiswal's Records During U19 World Cup!
  • 4 years ago
India vs Bangladesh, ICC Under-19 World Cup 2020 : Yashasvi Jaiswal came into the Under-19s Cricket World Cup 2020 with a lot of expectations from the fans and critics due to his exploits for the Mumbai senior team. Here's the list of Yashasvi Jaiswal records..
#under19worldcup2020
#under19worldcuphighlifghts
#IndiavsBangladeshfinalmatch
#IndiavsBangladesh
#YashasviJaiswal
#PriyamGarg
#ravibishnoi
#AkbarAli
#indvsban
#sportsnews
#RakibulHasan
#AtharvaAnkolekar
#KartikTyagi
#IndiaU19
#cricket
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్‌-19 పురుషుల క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హాట్‌ ఫేవరెట్‌ భారత్‌ను ఓడించి కొత్త చాంపియన్‌గా అవతరించింది. సీనియర్, జూనియర్, పొట్టి, వన్డే ఇలా ఏ ఫార్మాట్‌ అయినా బంగ్లాదేశ్‌ ఐసీసీ ప్రపంచకప్‌ నెగ్గడం ఇదే తొలిసారి. ఇక టోర్నీ ఆసాంతం అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన ఇండియా.. తుది పోరులో మాత్రం చేతులెత్తేసింది. ఐదోసారి అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలిచి రికార్డు సృష్టిద్దామనుకున్న భారత్‌కు.. బంగ్లా ఝలక్‌ ఇచ్చింది.
ఈ టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్‌.. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఈ టోర్నీలో యశస్వి.. 6 మ్యాచ్‌ల్లో 400 పరుగులు సాధించి, టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అందులో ఒక సెంచరీ సహా 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన యశస్వీ.. ఫైనల్లో 88 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఇక పార్ట్ టైమ్ స్పిన్నర్ అయిన జైస్వాల్.. ఫైనల్ మ్యాచ్‌లో కీలక వికెట్‌తో పాటు మొత్తం 3 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా యశస్వి (400) రికార్డుకెక్కాడు. 2004లో 505 పరుగులు చేసిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తొలి ప్లేయర్‌గా ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా 400 అంతకన్న ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో యశస్వీ 8వ బ్యాట్స్‌మన్.
అండర్-19 ప్రపంచకప్‌లో వరుసగా ఐదు 50 ప్లస్ స్కోర్లు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా జైస్వాల్ గుర్తింపు పొందాడు
Recommended