హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ కలకలం రేపుతున్నాయి. ఫార్మా కంపెనీలతో కుమ్మక్కైన ఓ ప్రొఫెసర్ వైద్యం కోసం ఆస్పత్రిలో చేరే చిన్నారులపై ప్రైవేట్ ఫార్మా కంపెనీల మెడిసిన్,వ్యాక్సిన్ ప్రయోగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.విస్తుపోయే ఈ వ్యవహారం హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్‌లో బయటపడింది. ఆస్పత్రికి వచ్చే చిన్నారులపై కొందరు డాక్టర్లు క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు.దీంతో ఆస్పత్రి లో ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.అత్యవసర సమయంలో ఆస్పత్రికి వచ్చిన సమయంలో చిన్నారులకు ఎలాంటి మందులు ఇస్తున్నారో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. దీంతో చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారని ఆరోపించారు. దీనిపై కొంతమంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో క్లినికల్ ట్రయల్స్‌పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం దీనికి సంబంధించి రహస్య విచారణ జరుగుతున్నట్టు సమాచారం.