Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Mr KK is a dubbed version of Tamil movie Kadaram Kondan and it is a action thriller movie written and directed by Rajesh Selva and produced by Kamal Haasan. The movie stars Vikram and Akshara Haasan in the lead roles. Music is composed by Ghibran.
#MrKK
#chiyanvikram
#aksharahasan
#nareshkumar
#sridhar
#tollywood

విభిన్నమైన కథాంశాలు, పాత్రల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటారు విక్రమ్. ఆయన హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం కడరం కొండన్. రాజేష్ సెల్వ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై కమల్‌హాసన్‌తో కలిసి టి. నరేష్‌కుమార్, టి.శ్రీధర్ మిస్టర్ కె.కె. పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. తెలుగు ట్రైలర్‌తో పాటు విక్రమ్ లుక్‌ను బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్‌లుక్, పొడవైన మీసంతో విక్రమ్ వినూత్నంగా కనిపిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్ పోలీస్ అధికారిగా భిన్న పార్శాలతో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అక్షరహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తమిళంలో ఈ సినిమాను ఆర్ రవీంద్రన్‌తో కలిసి హీరో కమల్‌హాసన్ నిర్మిస్తున్నారు.

Recommended