ఠారెత్తిస్తున్న ఎండలు... బేజారవుతున్న జనం || Oneindia Telugu

  • 5 years ago
The country continues to reel under severe heat wave conditions, with the weather department saying there will be no respite for the next two days.Heat wave conditions persisted in Delhi on Sunday, with the mercury soaring up to 46.2 degrees Celsius. It is set to again reach the 45-degree mark on Monday.
#telangana
#delhi
#temperature
#districts
#sun
#public
#problems
#Adilabad
#marriages

రానున్నరెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దేశరాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 46.2 డిగ్రీలు తాకుతాయని అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సోమవారం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో మేఘాలు లేకపోవడం వడగాలులు వీయడంతో ఉష్ణోగ్రతల్లో పెను మార్పు కనిపిస్తోందని వెదర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. ఢిల్లీ, దక్షిణ ఉత్తర ప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సౌరాష్ట్రలలో ఉష్ఱోగ్రతలు సాధారణం కన్నా అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించగా మధ్య భారతదేశానికి ఇవి విస్తరించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని వారు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో వేడి తారాస్థాయిలో ఉన్నందున వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్‌ను ప్రకటించారు. సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌ను తాకిన సమయంలో రెడ్ అలర్ట్‌ను అధికారులు జారీ చేస్తారు. ఢిల్లీలో ఆదివారం ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు సెల్సియస్‌గా నమోదు అయ్యింది.

Recommended