Tapsee Termed A Bollywood Young Hero As Marriage Material || Filmibeat Telugu

  • 5 years ago
Vicky Kaushal and Taapsee Pannu are all set to be back together, but this time on the small screens. Both Vicky and Taapsee recently shot for a chat show in which Taapsee went on to call Vicky 'marriage material'.
#vickykaushal
#taapseepannu
#saandkiaankh
#urithesurgicalstrike
#uri
#sanju
#naamshabana
#bollywoodactress
#bollywood

టాలీవుడ్‌కు దూరమైన తాప్సీ పన్ను బాలీవుడ్‌లో విలక్షణ నటిగా రాణిస్తున్నది. వరుస సినిమాలతోపాటు.. విజయాలతో కెరీర్‌ను ముందుకు నడిపిస్తున్నది. గతేడాది మన్మర్జియాన్, ఈ ఏడాది బద్లా లాంటి విజయాలను తన కెరీర్‌ ఖాతాలో వేసుకొన్నది. మన్మర్జియాన్ చిత్రంలో హీరో వికీ కౌశల్‌తో తాప్సీ కెమిస్ట్రీ విశేషంగా ఆకట్టుకొన్నది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వికీ కౌశల్‌పై తాప్సీ మనసు పారేసుకొన్నానని వెల్లడించింది. వికీపై ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.మన్మర్జియాన్ సినిమాకు ముందు వికీతో పరిచయం లేదు. కేవలం వాట్సప్‌ పరిచయం మాత్రమే ఉంది. వాట్సాప్‌లో చాటింగ్ చేసుకొనే సమయంలో అతను పెట్టే కొటేషన్ ఆసక్తికరంగా ఉండేది. ఆ తర్వాత సినిమా షూటింగ్‌లో ఒకరికొకరం దగ్గరయ్యాం. వికీ ఓ నమ్మదగిన వ్యక్తి అని అని తాప్సీ వెల్లడించింది.

Recommended