హెయిర్ బాగా పెరగాలి అంటే ఎలా? Food to reduce hairfall and reasons for hair fall__ 9Team Creations - YouTube (720p)

  • 5 years ago
ప్రతి ఒక్కరిలోనూ తలపై వెంట్రుకలు ఒక అందమైన భాగం. ఎన్నో సందర్భాలలో మన అలంకరణకు తగిన విధంగా హెయిర్ స్టైల్ చేసుకోవడం వలన మన ముఖంలో అదనపు glow కనిపిస్తుంది. గతంలో ఆడవారు మాత్రమే హెయిర్ స్టైల్ చేసుకునేవాళ్లు కానీ కాలం మారే కొద్దీ పురుషులు కూడా ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియలో మనకు తెలియకుండానే అనేక కెమికల్స్ మరియు అజాగ్రత్త వలన అనేక హెయిర్ ప్రాబ్లెమ్స్ ఎదురవుతున్నాయి అందులో ప్రధానమైనది హెయిర్ ఫాల్ సమస్య. మెడికల్ పరంగా హెయిర్ ఫాల్ సమస్యకు ప్రధాన కారణాలు సోరియాసిస్ రింగ్వార్మ్ క్యాన్సర్ చికిత్స థైరాయిడ్ వంటివి. ఇవి కాకుండా మన నిర్లక్ష్యం వలన కలిగే హెయిర్ ఫాల్ సమస్యలకు కారణాలు చాలానే ఉన్నాయి మరి. సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం, వాతావరణంలో మార్పులు బిగువైన హెయిర్ styles, split ends, డాండ్రఫ్ వేడినీటితో తలస్నానం చేయడం, ఒత్తిడికి గురవడం మద్యపానం సేవించడం ధూమపానం, ఎక్కువగా ఎండలో తిరగటం, వైద్య పరిస్థితులు ,వాతావరణ కాలుష్యం హెయిర్ స్టైల్ చేసుకునే సమయంలో ఉపయోగించే కెమికల్స్ ప్రెగ్నెన్సీ తర్వాత కలిగే హార్మోన్ల మార్పుల వలన హెయిర్ ఫాల్ కలిగే అవకాశం ఉంది. హెయిర్ ఫాల్ సమస్యకు ఎన్నో వైద్యచికిత్సలు ఉన్నప్పటికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యను తొలగించేందుకు ఉత్తమ మార్గం inti నివారణ పద్ధతులను అనుసరించడం. వీటిని మూడు భాగాలుగా చేసుకుంటే మొదటిది పోషకాహారం:: మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారంలో ప్రోటీనులు విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉన్నట్లయితే జుట్టు క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా విటమిన్ ఏ బి సి డి మరియు ఐరన్ జింక్ కాపర్ మెగ్నీషియం సెలీనియం ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ బి కాంప్లెక్స్ జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది కాబట్టి mana రెగ్యులర్ డైట్ లో పాలు పెరుగు చీజ్ చికెన్ గుడ్లు ఆకుకూరలు చేపలు బ్రోకోలి వెజిటేబుల్ , బ్రౌన్ బ్రెడ్ ni రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఐరన్ లెవెల్స్ ప్రోటీన్ ఉండే పదార్థాలను తీసుకోవాలి ఇవి ఎగ్ వైట్ పప్పుదినుసుల నుంచి పుష్కలంగా లభిస్తాయి. ఇక రెండవది స్ట్రెస్ రిలీఫ్::Stress తీసుకోవడం వలన మైక్రో సర్కులేషన్ blood vessels బిగుతుగా అయిపోయి మన జుట్టుకి అందాల్సిన పోషకాలు వాటికి అందించకుండా చేస్తాయి. యోగ ఆసనాల వల్ల stress కంట్రోల్లో ఉంటుంది టెన్షన్ దూరమవుతుంది మంచి blood , మంచి న్యూట్రియన్స్ ను అందించడం వలన లోపల నుంచి ఏ రూపంలో మార్పును గమనించవచ్చు. ఇక మూడవది కాలుష్యం:: సూర్య కిరణాలు యు.వి radiations కు ఎక్స్పోజ్ అవడం, రకరకాల షాంపూలను ఉపయోగించడం వలన వెంట్రుకలు చిట్లిపోవడం డ్రైగా అవ్వడం జరుగుతుంది. వీటి కోసం ఆమ్లా ,ఆవాల నూనె, కలబంద కొబ్బరి పాలు కొత్తిమీర ఆకులు ఆయిల్ మసాజ్ జిలకర విత్తనాలు egg white, వేపాకు, పెరుగు ద్రాక్ష గింజల నూనె ఉల్లిపాయ Rasam గ్రీన్ టీ ,మెంతులు, మందార ఆకులు లాంటివి తలస్నానం కి ముందు కొబ్బరి నూనెతో కలిపి మాడుకు మర్దన చేయాలి. వీటి వల్ల జుట్టు ఒత్తుగా సాఫ్ట్గా అవుతుంది
Visit https://9teamcreations.in for more information

Recommended