Dhoni is getting a lot of fans day by day.On New Zealand's batting, a fan faced a security guard and ran towards Dhoni with a tricolor flag. #msdhoni #indiavsnewzealand #teamindia #cricket #indiainnewzealand2019 #tricolorflag #security #pandya
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోసం అభిమానులు స్టేడియాల్లో బారికేడ్లు దూకి మైదానంలోకి వెళ్లిపోవడం కొత్తేమీ కాదు. ఇండియాలో ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా న్యూజిలాండ్‌తో ఆదివారం ముగిసిన మూడో టీ20లో కూడా ఓ అభిమాని ఇదే పని చేశాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చేతిలో త్రివర్ణ పతాకంతో ఓ అభిమాని భద్రత సిబ్బందిని దాటుకుని ధోనీ వైపు పరుగెత్తుకొచ్చాడు.