Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Venky Atluri and Akhil Akkineni's Mr Majnu Review.The Movie Getting Good Public talk.
#MrMajnu
#MrMajnuPublicTalk
#MrMajnumoviereview
#AkhilAkkineni
#VenkyAtluri
#tollywood

అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని, తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో మిస్టర్ మజ్ను చిత్రం విడుదలకు సిద్ధమైంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, తమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 25న రిలీజ్‌అయింది. తొలిప్రేమ తర్వాత వస్తుండటంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్‌కు సక్సెస్ లభించిందా? వెంకీ అట్లూరి ద్వితీయ విఘ్నాన్ని అధిగమించారా? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా కథ, కథనాలను సమీక్షించాల్సిందే..
విక్కి (అఖిల్ అక్కినేని) అమ్మాయిలతో నిత్యం జల్సా చేసే ప్లేబాయ్. అలాంటి అబ్బాయితో నిక్కి (నిధి అగర్వాల్) లండన్‌లో పరిచయం జరుగుతుంది. తన లైఫ్‌ స్టయిల్, ప్రవర్తన చూసి మొదట ఏవగించుకుంటుంది. ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్‌లో నిక్కీ గురించి తెలుసుకొన్న తర్వాత విక్కీతో నిక్కి ప్రేమలో పడుతుంది. కానీ ప్రేమ పేరుతో విసిగించడాలు నచ్చక నిక్కీ ప్రేమను రిజెక్ట్ చేస్తాడు?
దాంతో నిక్కీ లండన్‌కు వెళ్లిపోతుంది? నిక్కి లేనిలోటుతో తాను ఏం కోల్పోయాడో విక్కీ తెలుసుకొంటాడు. నిక్కిపై తనలో ఎంత ప్రేమ ఉందో రియలైజ్ అవుతాడు? నిక్కి ప్రేమను గెలుచుకోవడానికి విక్కీ లండన్ చేరుకొంటాడు? లండన్‌లో నిక్కి ప్రేమను ఎలా గెలుచుకొన్నాడు? ఈ కథలో జయప్రకాశ్, నాగబాబు, సుబ్బరాజు, ప్రియదర్శి, హైపర్ ఆది పాత్రలు ఏంటనే అనే సింపుల్ ప్రశ్నలకు సమాధానమే మిస్టర్ మజ్ను సినిమా కథ.
లండన్‌‌లో చదువుకునే విక్కిని ప్రిన్స్‌‌పాల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేసే అంశంతో కథ ప్రారంభమవుతుంది. ప్రొఫెసర్ కూతురుతో బెడ్ రూంలో దొరకడం, దానిపై విచారణ సమయంలో ఏకంగా కాలేజీ లీగల్ ఆఫీసర్‌ను నిక్కీ బుట్టలో పడేయడమనే పాయింట్‌తో అతడి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌ చేసి కథలోకి వెళ్తాడు. ఆ సమయంలోనే అనుకోకుండా విక్కి గురించి నిక్కి తెలుసుకోవడం..ఆ తర్వాత ద్వేషం పెంచుకోవడం.. ఓ పెళ్లి సందర్బంగా జరిగిన ఓ కీలకమైన అంశం వల్ల విక్కిపై నిక్కి ప్రేమను పెంచుకోవడం..నిక్కి ప్రేమను విక్కి రిజెక్ట్ చేయడం తో తొలిభాగం ముగుస్తుంది.
ఇక రెండో భాగంలో లండన్‌లో నిక్కీ ప్రేమను గెలుచుకోవడానికి విక్కి చేసే ప్రయత్నాలు. అలాగే చిన్న పిల్లాడితో కార్టూన్ క్యారెక్టర్‌ను సృష్టించి కామెడీ పండించడం లాంటివి కాస్త పర్వలేదనిపిస్తాయి.సెకండాఫ్‌లో హైపర్ ఆది పాత్ర సినిమాకు మైనస్‌అని చెప్పచ్చు. సినిమాకు కీలకమైన రెండో భాగాన్ని ఫీల్‌గుడ్‌గా మలచకపోవడంతో కథ తెలిపోయినట్టు అనిపిస్తుంది. పెద్దగా భావోద్వేగాలు లేకుండా హీరో, హీరోయిన్ల మధ్య సయోధ్యను కుదర్చడంతో కథ చాలా రొటీన్‌గా ముగుస్తుంది.
ప్రేమలో విఫలమైతే జరిగే బ్రేకప్‌కు, హార్ట్ బ్రేకప్‌కు తేడా పాయింట్‌‌తో తెరకెక్కిన చిత్రం మిస్టర్ మజ్ను. కథ పేలవంగా ఉండటం, కథనంలో వేగం లేకపోవడం సినిమాకు ప్రతికూలత. యూత్‌కు నచ్చే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోగలిగితే సానుకూలమైన ఫలితం వచ్చే అవకాశం ఉంది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచి అఖిల్‌ను సక్సెస్ బాట పట్టించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

Recommended