Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
For the first T20, which will be held in Brisbane on November 21, around 30,000 people are expected to be present; while for the second match at Melbourne Cricket Ground, the figure is likely to be around 70,000.
#IndiavsAustralia1stT20
#IndvsAus
#viratkohli
#rohitsharma
#Brisbane

భారత్-ఆస్ట్రేలియా ఇరు జట్లు బలాబలాలు తేల్చుకోవడానికి వేళైంది. బుధవారం బ్రిస్బేన్ వేదికగా తొలి టీ20లో తలపడనుండగా ఇప్పటికే దాదాపు టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న సిరీస్‌ కావడంతో మ్యాచ్‌ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు విక్రయించారు. అమ్మకాలు ఇంకా పెరగొచ్చని మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. సిరీస్ మొత్తానికి 1,35,000 మంది వరకూ అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు రావొచ్చని అంచనా. తొలి టీ20 బ్రిస్బేన్‌లో జరుగుతుండగా రెండో టీ20ని మెల్‌బోర్న్‌లో నిర్వహించేందుకు పూనుకున్నారు. ఇక మూడోది సిడ్నీలో నిర్వహించి ముగించనున్నారు. రెండో మ్యాచ్‌ జరిగే మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానం ప్రపంచంలోనే అతిపెద్దది. దాదాపు 70వేల అభిమానులు వస్తారని అంచనా. ఇక బ్రిస్బేన్‌కు 30 వేలు, సిడ్నీకి 35వేలు మంది ప్రేక్షకులు హాజరవుతారని అంటున్నారు. ఆస్ట్రేలియా, భారత్‌ క్రికెట్‌ పోరుకు విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది.

Category

🥇
Sports

Recommended