ఆ మంచి పనులతోనే ఆనందం.. వారధిలా ఈ యాప్ : మోదీ

  • 6 years ago
Prime Minister Narendra Modi during the launch of 'Main Nahi Hum' portal today praised Indian youth for using technology for welfare of others. "India's youngsters are leveraging the power of technology wonderfully. They are using technology not only for themselves but also for the welfare of others. This is a great sign", said PM Modi while addressing IT professionals.
#PMModi
#MainNahiHum
#technology
#ITprofessionals
#delhi

ఇతరుల కోసం చేసే పని మనకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ఉద్యోగ రీత్యా పనిచేయడం సాధారణమేనని, ఇతరుల కోసం మంచి పనులు చేయడం ఎనలేని ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. ఎలాంటి వృత్తిలో ఉన్నవారికైనా ఇదే వర్తిస్తుందని చెప్పారు. సర్కారు చేయలేని ఎన్నో పనులను మన సంస్కారం చేస్తుందని తెలిపారు. బుధవారం (అక్టోబర్ 24) సాయంత్రం ఆయన ఢిల్లీలో సమాచార, సాంకేతిక (ఐటీ), ఎలక్ట్రానిక్‌ తయారీ రంగాల నిపుణులతో ముఖాముఖి నిర్వహించారు. దేశంలోని సుమారు 100 ప్రాంతాల నుంచి ఆయా రంగాల నిపుణులు మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ దేశంలో యువత ఎదగడానికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు.

Recommended