రేవంత్ రెడ్డి పై ఐటీ శాఖ అధికారుల ప్రశ్నల వర్షం

  • 6 years ago
Telangana Congress working president Revanth Reddy attends IT enquiry on Wednesday.
#revanthreddy
#itraids
#hyderabad
#incometax
#telangana
#congress

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం ఐటీ శాఖ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గత వారం రెండు రోజులకు పైగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు అక్టోబర్ 3వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయానికి రేవంత్‌ ఉదయం చేరుకున్నారు. ఆయనను పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు, అలాగే హామీ ఇచ్చిన రూ.4.50 కోట్ల గురించి కూడా ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.

Recommended