పులిపిరికాయలు చాలా సాధారణమైన సమస్య. జనాభాలో ప్రతి వంద మందిలోనూ కనీసం 10 నుండి 15 మందికి చర్మంపైన పులిపిరులు కనిపిస్తుంటాయి. పులిపిరి కాయలను ఉలిపిరి కాయలనీ, వార్ట్స్ అనీ సాధారణ పేర్లతో పిలుస్తుంటారు. పులిపిరిలకు ప్రధాన కారణం వైరస్ (హ్యూమన్ పాపిలోమా వైరస్). ఎక్కువగా యుక్త వయస్కుల్లో కనిపిస్తాయి. పులిపిరి కాయలు చూడటానికి చర్మపురంగులో కనిపిస్తాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవు. ఒకవేళ ఒత్తిడి పడేచోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖంపైనా, మెడ పైనా, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి.
Follow our channel here in Dailymotion ************************************************ Also Follow us on your favorite social media platforms: