Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Shyamala and Nutan Naidu has high chances to Bigg Boss reentry. Audience talking much about these Two
బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే టైటిల్ పోరు మొదలైపోయింది. హౌస్ లో సభ్యుల పెర్ఫామెన్స్ చూస్తుంటే టైటిల్ దక్కించుకోవడం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైల్డ్ కార్డు ఎంట్రీ, ఎలిమినేట్ అయిన వారిని తిరిగి ఓటింగ్ ద్వారా హౌస్ లోకి తీసుకుని వచ్చే విధానం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాగా ఈ ఓటింగ్ ప్రక్రియలో ఎలిమినేట్ అయిన సభ్యులలో ఎవరు తిరిగి హౌస్ లోకి చేరుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.
ఆడియన్స్ లో ఎక్కువగా నూతన నాయుడు పేరు వినిపిస్తోంది. సామాన్యుడిగా అతడివైపు ఆడియన్స్ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఆరంభంలోనే నూతన నాయుడు హౌస్ లో కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. బాగా ఎవరు ఎంటర్ టైన్ చేయగలరు అని ప్రేక్షకుడు ఆలోచిస్తే నూతన్ నాయుడుకి మైనస్ గా మారె అవకాశం ఉంది.
#Shyamala
#NutanNaidu

Recommended