భగత్ సింగ్ చనిపోవడానికి గాంధీ కారణమా...??
  • 6 years ago
భగత్ సింగ్... ఈయన పంజాబ్ లో సెప్టెంబరు 22, 1907న జన్మించారు. మార్చి 23, 1930న మరణించారు. ఈయన స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు.గొప్ప కమ్యూనిస్టు ఢిల్లీ వీదిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు.విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వాతంత్ర్యోద్యమము లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు. ఈ కారణంగానే 'షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు'.
1928లో భారత్‌లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సభ్యుడిగా ఒక్క భారతీయుడిని కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబరు 1928న కమిషన్ లాహోర్‌‌ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలా లజ్‌పత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు. లాలా లజ్‌పత్ రాయ్‌ ఛాతీపై పోలీసులు లాఠీలతో కొట్టారు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్ మరియ సుఖ్‌దేవ్ థాపర్‌లతో ఆయన చేతులు కలిపాడు. స్కాట్‌ను గుర్తించిన జై పాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డీఎస్పీ J. P. సాండర్స్ కనిపించినప్పుడు సింగ్‌కు జై పాల్ సంకేతమిచ్చాడు. ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంట పడకుండా ఉండటానికి భగత్ లాహోర్‌ పారిపోయారు. గుర్తు పట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవడం, వెండ్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు సింగ్ పాల్పడ్డాడు.
#BhagatSingh
#Gandhi
#Satyagraha
#BritishGovernment
Recommended