Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
ధోని అభిమానులకు శుభవార్త. ఎట్టకేలకు ఇంగ్లాండ్ పర్యటనలో ధోని తెల్లగడ్డం తీసేసి కనిపించాడు. భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో ధోనీ తెల్ల గడ్డంతో కనిపించిన సంగతి తెలిసిందే. ధోని కొత్త లుక్‌ అభిమానులకు నచ్చలేదు.అంతేకాదు టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ సైతం తెల్ల గడ్డంలో ఉన్న ధోనిని చూసి ఐదు నుంచి పదేళ్ల పెద్దగా కనిపిస్తున్నాడంటూ ఓ టీవీ షోలో వ్యాఖ్యానించాడు. దీంతో పాటు ధోని తన గడ్డం రంగు మార్చుకోవాలని లేదా తన గడ్డానికి రంగు వేసుకోవాలని సలహా కూడా ఇచ్చాడు.గంభీర సలహా పాటించాడో లేదో తెలియదు గానీ... ధోని ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడే తన తెల్లగడ్డాన్ని తీసేశాడు. తాజాగా ధోని క్లీన్‌ షేవ్‌లో ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల సిరిస్ ముగియడంతో ధోని భారత్‌కు తిరుగు పయనమయ్యాడు.

MS Dhoni seems to have left behind both his patchy form and beard on the cricket field after enduring a tough ODI and T20 series against England by his lofty standards, as he appeared fresh and relaxed in a picture shared on Twitter by Indian spinner Akshar Patel.
#msdhoni
#cricket
#teamindia
#indiainengland2018

Category

🥇
Sports

Recommended