మనం ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ను ఎంతో ఖర్చుపెట్టి కొనుగోలు చేస్తుంటాం. అయితే ఆఫోన్ పొరపాటున నీళ్లలో పడితేనే దాన్ని వదిలేసి కొత్త ఫోన్ కొనుక్కోవాలి. కొంచెం ఖరీదైన ఫోన్ అయితే, సర్వీస్ ఇంజనీర్ వద్దకు తీసుకెళ్లితే పనిచేస్తుందేమో. ఇక చాలాసేపు నీళ్లల్లో ఫోన్ పడిపోతే దానిపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే, నాణ్యతకు మారుపేరైన ఆపిల్ ఫోన్లకు మాత్రం ఇది వర్తించదు. ఆపిల్ ఐఫోన్లు ఫర్‌ఫార్మెన్స్‌కు మారు పేరుగా నిలుస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణే ఐఫోన్ 7. సముద్రంలో దానిపని తీరు అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేసింది.