RX100 Movie Collections

  • 6 years ago
RX100 six days box office collections. This movie collected more than 15 cr gross
#RX100

చిన్న చిత్రాలు హిట్ అయితే చాలు నిర్మాతకు లాభాల పంట పడుతుంది. చిన్నచిత్రాలు విజయం సాధిస్తే పెట్టుబడికి రెండు రెట్లు, మూడు రేట్లు అధికంగా లాభాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ కోవలోకే ఇటీవల విడుదలైన ఆర్ ఎక్స్ 100 చిత్రం వస్తుంది. బోల్డ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ని ఊపేస్తోంది. ఈ చిత్రం సాధిస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
కార్తీకేయ, పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రంలో జంటగా నటించారు. వీరిద్దరి పెర్ఫామెన్స్ కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రొమాంటిక్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ కుర్రకారుని బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రం సాధిస్తున్న వసూళ్లు చూస్తే ఇటీవల విడుదలైన చిన్న చిత్రాలలో పెద్ద విజయం దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కేవలం 2 కోట్ల అతితక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం అంతకు 10 రేట్లు వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది.

Recommended