Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Their middle-order frailties laid bare in the previous match, India would be aiming to plug the loopholes in Tuesday's series-deciding third and final ODI against England, where a win would fetch Virat Kohli's men their 10th successive series triumph.
#england
#india
#cricket
#eoinmorgan

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఇండియా రెండో సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్‌తో కీలకమైన మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. సోమవారం నెట్స్‌లో తీవ్ర సాధన చేసింది. గాయంతో వన్డేలకు దూరమైన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తిరిగి జట్టుతో కలిసి సాధన చేశాడు. సహచరులకు బౌలింగ్‌ చేశాడు. మ్యాచ్‌లోపు అతడు ఫిట్‌ అయితే భారత్‌ ఎదుర్కొంటున్న డెత్‌ ఓవర్ల సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయి.శార్దూల్‌ ఠాకూర్‌, ధోనీ, రైనాతో కలిసి భువి మైదానంలో సాధన చేశాడు. భువి రాకతో బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా మారినా మిడిలార్డర్‌ విభాగం మాత్రం సమస్యగానే కనిపిస్తోంది. తొలి వన్డేలో దుమ్ము దులిపేసిన టాప్‌ ఆర్డర్‌ రెండో వన్డేలో కుప్పకూలడంతో మిడిలార్డర్‌ వైఫల్యం మరోసారి బయటపడింది. ధోనీ చాలా నెమ్మదిగా ఆడాడు. రైనా ఫర్వాలేదనిపించాడు. ఇక మిగిలినవారు కనీసం సింగిల్స్‌ తీయడానికీ కష్టపడ్డారు.

Category

🥇
Sports

Recommended