ఇమ్రాన్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ భార్య
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, తెహ్రికె ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ తన మాజీ భర్త గురించిన పలు వివాదాస్పద విషయాలను వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ వివాదాస్పద పుస్తకం విడుదలైంది. గత కొన్నాళ్లుగా ఈ పుస్కకంలోని కీలక అంశాలను లీక్ చేస్తూ వచ్చిన ఆమె గురువారం మార్కెట్లోకి రిలీజ్ చేసింది.ఇందులో తమ పది నెలల వైవాహిక జీవితం, ఇమ్రాన్ రాజకీయ, వ్యక్తిగత జీవితం గురించి ఇందులో వివరించింది. ఇమ్రాన్ ఖాన్‌కు ఆరుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. ఆయనకున్న సంతానం గురించి ఇమ్రాన్ తనకు వెల్లడించారని, ఈ విషయాలు ఆయన మొదటి భార్య జెమ్మిమా గోల్డ్ స్మిత్‌కు తెలుసని రెహమ్ తెలిపింది.
Category
🥇
Sports